శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 1 జూన్ 2018 (11:16 IST)

పడుకునేముందు పొత్తికడుపుకు నువ్వుల నూనెను రాసుకుంటే....

ప్రతిరోజు కనీసం 20 నిమిషాల పాటు జాగింగ్, స్విమ్మింగ్ లేదా నడవటం వలన మహిళలకు హార్మోన్లను నియంత్రించుటకు ఉపయోగపడుతాయి. పాలిచ్చే తల్లులకు పాలకూర, బ్రౌన్ రైస్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అల్లం ముక్కను చ

ప్రతిరోజు కనీసం 20 నిమిషాల పాటు జాగింగ్, స్విమ్మింగ్ లేదా నడవటం వలన మహిళలకు హార్మోన్లను నియంత్రించుటకు ఉపయోగపడుతాయి. పాలిచ్చే తల్లులకు పాలకూర, బ్రౌన్ రైస్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అల్లం ముక్కను చప్పరించడం లేదా అల్లం టీ త్రాగడం వలన బహిష్టు నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చును. 
 
తెల్లనువ్వులు, బెల్లం యువతులకు చాలా మంచిది. ఇంగువ ఆహారంలో తీసుకోవడం వలన మహిళలకు బహిష్టు నొప్పులు తగ్గుతాయి. పడుకునేముందు పొత్తికడుపుకు నువ్వుల నూనెను రాసుకుంటే హార్మోన్లను నియంత్రిస్తుంది. స్త్రీలు పెరుగు తీసుకోవడం వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా నిరోదిస్తుంది. తులసి ఆకులు గర్భాశయానికి చాలా ఉపయోగపడుతాయి.
 
క్యారెట్ జ్యూస్ మహిళల ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతికూరను కొన్ని రోజులవరకు క్రమం తప్పకుండా తీసుకుంటే నెలసరి క్రమబద్దమవుతుంది. తులసి టీ, విటమిన్ ఇ గల ఆకుకూరలు తీసుకుంటే రొమ్ము క్యాన్సర్, రొమ్ము నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చును. ముట్టు సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడుతున్న మహిళలు ఆ కాలంలో రెండుసార్లు పలచని నిమ్మరసం త్రాగితే మంచిది.
 
పుదీనా ఆకులను ఎండబెట్టి, పొడిచేసుకుని, రెండు గ్లాసుల నీటిలో ఆ పొడిని వేసి మరిగించి, చల్లరాక వడకట్టి త్రాగితే బహిష్టు నొప్పులు తగ్గుటకు ఉపయోగపడుతుంది. మహిళలు ఎక్కువగా ఎముకల వ్యాధికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం పుష్కలంగా లభించే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది.