బుధవారం, 1 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 1 జూన్ 2018 (21:02 IST)

ఖర్భూజ పండు తింటే ఏంటి లాభం?

వేసవిలో విరివిగా దొరికే పండు ఖర్బూజ పండు. ఈ పండులో అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈఖర్బూజ పండులో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. కాబట్టి వేసవి తాపం తగ్గించుకోవడానికి ఈ పండు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పండు ముఖ్యంగా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.

వేసవిలో విరివిగా దొరికే పండు ఖర్బూజ పండు. ఈ పండులో అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈఖర్బూజ పండులో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. కాబట్టి వేసవి తాపం తగ్గించుకోవడానికి ఈ పండు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పండు ముఖ్యంగా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. వీటిలో వున్న పోషక విలువలేంటో తెలుసుకుందాం. 
 
1.ఖర్బూజ పండులో ఎక్కువ శాతం బీటాకెరోటిన్, విటమిన్ సి ఆరోగ్యానికి తోడ్పడి క్యాన్సర్ బారిన పడిన కణాలను తగ్గిస్తుంది. దీనిలో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు శరీరంలోని తెల్ల రక్త కణాలను వృద్ది చెందేలా చేసి రక్తంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
 
2. ఖర్బూజ పండులో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. కంటి సంబందిత సమస్యలను దూరం చేసి కంటి చూపు బాగా ఉండేలా చేస్తుంది.. వడదెబ్బ నుండి రక్షిస్తుంది.
 
3. ఖర్బూజ పండులో విటమిన్ కె మరియు విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. దీని వలన ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పని చేస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ చక్కగా జరిగేలా ఉపయోగపడుతుంది.
 
4. ఖర్బూజ పండులో అధిక మోతాదులో పొటాషియం ఉండడం వలన గుండెకు మంచి న్యూట్రియన్స్‌ని అందజేస్తుంది. దీనిలో ఫోలెట్ ఉండడం వలన గుండె జబ్బుల నుండి కాపాడుతుంది.
 
5. ఖర్బూజలో తక్కువ క్యాలరీస్ కలిగి ఎక్కువగా పీచు పదార్థం ఉండటం వలన అధిక బరువుని తగ్గిస్తుంది. 
 
6. ఖర్బూజ జ్యూస్ తాగడం వలన మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి, ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. ఈ జ్యూస్‌ని క్రమం తప్పకుండా సేవిస్తే రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది.
 
7. ఈ పండు కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. ఈ పండులో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. బిడ్డ ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది.