1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 4 జూన్ 2018 (12:20 IST)

ముదిరిన నారింజ పండు ఆరోగ్యానికి అలా ఉపయోగపడుతుంది...

నారింజ పండును తీసుకుంటే ఎముకలు, దంతాల దృఢత్వానికి ఎంతగానో సహకరిస్తుంది. నారింజలో సోడియం, పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషియం, రాగి గంధకం ఇవ్వన్నీ ఆహారనాళాలలో విషక్రిములు చేరకుండా నిరోధించే శక్తిని కలిగిఉ

నారింజ పండును తీసుకుంటే ఎముకలు, దంతాల దృఢత్వానికి ఎంతగానో సహకరిస్తుంది. నారింజలో సోడియం, పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషియం, రాగి గంధకం ఇవ్వన్నీ ఆహారనాళాలలో విషక్రిములు చేరకుండా నిరోధించే శక్తిని కలిగిఉంటుంది.  నారింజలో బెటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని కణజాలాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 
ఈ నారింజ రక్తప్రసరణను సక్రమంగా జరుగుటకు దోహదపడుతుంది. ఫలితంగా గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ సి శాతం ఎక్కువగా ఉండడం వలన ఈ పండును రోజు తీసుకుంటే చర్మానికి మంచి నిగారింపును సంతరించుకుంటుంది. జలుబు, దగ్గు లాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. నారింజను తింటే అజీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చును. 
 
నారింజలో గల లవణాలు దేహానికి చాలా సహాయపడుతాయి. కాబట్టి వేసవికాలంలో నారింజ పండ్లను తినటం శ్రేయస్కరం. నారింజ పండు కఫ, వాత, అజీర్ణక్రియలను హరిస్తుంది. శరీరానికి బలం, తేజస్సును చేకూర్చుతుంది. మూత్రాన్ని సరళంగా జారీ చేస్తుంది. ముదిరిన నారింజ కాయలను కోసి, ఉప్పులోఊరించి ఎండించి తరువాత అందులో కారం, మెంతి చేరిస్తే ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. ఈ పండు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మేలు చేస్తుంది.