మృదువైన చర్మం కోసం... ఏం చేయాలి?
వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉండడం వలన ముఖం నల్లగా మారి కాంతిహీనంగా తయారవుతుంది. దీనిని తొలగించుకోవటానికి రకరకాల లోషన్స్‌ను వాడుతుంటారు. అలాకాకుండా ప్రకృతిలో సహజంగా లభించే పదార్థాలతో మన అందాన్ని మరింత పెంచుకోవచ్చు. ఎండ, దుమ్ము, మరియు ధూళిలో ఎక్కువుగా త
వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉండడం వలన ముఖం నల్లగా మారి కాంతిహీనంగా తయారవుతుంది. దీనిని తొలగించుకోవటానికి రకరకాల లోషన్స్‌ను వాడుతుంటారు. అలాకాకుండా ప్రకృతిలో సహజంగా లభించే పదార్థాలతో మన అందాన్ని మరింత పెంచుకోవచ్చు. ఎండ, దుమ్ము, మరియు ధూళిలో ఎక్కువుగా తిరగడం వలన చర్మంపై మృతకణాలు పేరుకుపోయి చర్మం నలుపుగా మారుతుంది. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం.
1. ఒక టమోటా తీసుకొని దానిని మెత్తగా పేస్టులా చేయాలి. దానికి ఒక టీ స్పూన్ తేనె, చిటికెడు పసుపు, ఒక టీస్పూన్ పెరుగును కలిపి దానిని ముఖానికి పట్టించాలి. ఇలా క్రమంతప్పకుండా వారంలో మూడురోజుల పాటు చేయడం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది.
2. కొద్దిగా టమోటా గుజ్జులో పంచదారను కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి మర్దన చేసుకోవాలి తరచూ ఇలా చేయడం వల్ల చర్మంపై మృతకణాలు తొలగి చర్మం మృదువుగా తయారవుతుంది.
3. టమోటా గుజ్జును తీసుకొని ఐస్ క్యూబ్ ట్రేలో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఎండలో నుంచి ఇంటికి రాగానే ఈ టమోటా ఐస్ క్యూబ్‌తో మృదువుగా మర్దన చేయాలి. ఇది ఎండ వలన కమిలిపోయిన చర్మానికి స్వాంతన చేకూర్చి సూర్యకిరణాల వల్ల చర్మానికి హాని కలుగకుండా కాపాడుతుంది. ముఖం తాజాగా ఉండేలా చేస్తుంది.
4. టమోటా గుజ్జు, కమలా పండు గుజ్జు, కీర రసాన్ని సమాన పరిమాణంలో కలిపి రాత్రిపూట ముఖానికి రాసుకొని సుమారు అరగంట తర్వాత ఆరనిచ్చి కడిగేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన పిగ్మెంటేషన్ సమస్య చాలావరకు దూరం అవుతుంది. ముఖం ఛాయ మెరుగవుతుంది. చర్మ గ్రంధులు శుభ్రపడతాయి.
5. టమోటా రసంలో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి ముఖానికి మర్దన చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.