సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : శనివారం, 26 మే 2018 (14:08 IST)

మెుటిమల నివారణకు కందిపప్పును తీసుకుంటే?

మెుటిమలు రావడం వలన ముఖంపై నల్ల మచ్చలు ఏర్పడుతాయి. సూర్యరశ్మి చర్మం మీద ఎక్కువగా పడటం వలన కూడా నల్లమచ్చలు ఏర్పడుతాయి. బయటకు వెళ్ళేటప్పుడు చర్మానికి సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేస్తే మంచిది. చర్మం మెుటిమలు, మచ్చలు లేకుండా అందంగా కనిపించడానికి కొన్ని గృ

మెుటిమలు రావడం వలన ముఖంపై నల్ల మచ్చలు ఏర్పడుతాయి. సూర్యరశ్మి చర్మం మీద ఎక్కువగా పడటం వలన కూడా నల్లమచ్చలు ఏర్పడుతాయి. బయటకు వెళ్ళేటప్పుడు చర్మానికి సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేస్తే మంచిది. చర్మం మెుటిమలు, మచ్చలు లేకుండా అందంగా కనిపించడానికి కొన్ని గృహచిట్కాలు మీకోసం.
 
ద్రాక్ష, ఆపిల్ రెండిటిలోనూ సహజంగానే విటమిన్లు, ఆసిడ్స్ ఉన్నాయి. ఇవి శరీరాన్ని కాంతివంతంగా చేయుటకు ఉపయోగపడుతాయి. ఒక ఆపిల్ ముక్క తీసుకొని రెండు ద్రాక్షలు కలిపి పేస్ట్ తయారుచేసి ముఖానికి అప్లై చేయాలి. 10 నిమిషాల తరువాత నీటితో కడగాలి. ఇలా ఒక నెల రోజులపాటు చేస్తే ముఖములోని మార్పును గమనించవచ్చును.
 
మొటిమలు, మచ్చలు మాత్రమే కాకుండా చర్మ సమస్యలను కూడా ముల్లంగి దూరం చేస్తుంది. ఒక ముల్లంగిని తీసుకొని పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేయడం వలన మీరు ఒక నెలలోనే మీ చర్మంలో వచ్చిన కాంతిని గమనిస్తారు.
 
మొటిమల మచ్చలను తొలగించడానికి ఇది ఒక మంచి ఉపాయం. ఒక స్పూన్ కందిపప్పుని తీసుకుని రాత్రివేళ నానపెట్టాలి. ఉదయాన్నే నానిన కందిపప్పులో పాలు కలుపుతూ పేస్ట్ తయారుచేయాలి. ఈ  పేస్ట్‌ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల పాటు అలానే ఉంచాలి.  తరువాత చేతితో రుద్దుతూ గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన 15 రోజుల్లో మీరు తేడాని గమనించవచ్చు.