ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : గురువారం, 31 మే 2018 (13:04 IST)

కలబంద గుజ్జును నిమ్మరసంలో కలిపి తీసుకుంటే?

కలబందలో అధికంగా విటమిన్స్, మినరల్స్ కలిగి ఉంటుంది. విటమిన్ ఎ, సి, ఇ, బి1, బి2, బి3, బి6, కోలీన్ వంటి ముఖ్యమైన విటమిన్స్‌లను కలిగి ఉంటుంది. విటమిన్ బి12 కలిగి ఉండే కొన్ని చెట్లలో కలబంద కూడా ఒక చెట్టే.

కలబందలో అధికంగా విటమిన్స్, మినరల్స్ కలిగి ఉంటుంది. విటమిన్ ఎ, సి, ఇ, బి1, బి2, బి3, బి6, కోలీన్ వంటి ముఖ్యమైన విటమిన్స్‌లను కలిగి ఉంటుంది. విటమిన్ బి12 కలిగి ఉండే కొన్ని చెట్లలో కలబంద కూడా ఒక చెట్టే. అంతేకాకుండా ఇందులో క్యాల్షియం, మెగ్నిషియం, జింక్, ఐరన్, పొటాషియం, కాపర్, మాంగనీస్ వంటికి పుష్కలంగా ఉంటాయి.
 
కలబందతో సౌందర్యాన్ని మరింత పెంపొందించుకోవచ్చు. కలబందలో గాలినుంచి తేమను గ్రహించే గుణం అధికంగా ఉంటుంది. దీని రసాన్ని ముఖానికి వాడడం వలన ముఖంపై నిగారింపు వస్తుంది. మచ్చలకు, చర్మ సౌందర్యానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. వీటిని సంబంధించిన చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం. 
 
కలబంద ఆకులనుంచి వచ్చే రసంలో కొబ్బరినీళ్ళు కాసింత కలిపి మోచేతులకు, మోకాళ్ళకు, పాదాలకు రాసుకుంటే నల్లటి మరకలు తొలగిపోతాయి. ఉదయం పరకడుపున కలబంద ఆకులను తింటే కడుపులో ఉన్న అనారోగ్య సమస్యలు మటుమాయమవుతాయి. చర్మ పొడిబారినట్లుంటే రోజ్ వాటర్‌లో కలబంద రసం కలిపి చర్మంపై పూతగా వేసుకుని కాసేపు తరువాత గోరువెచ్చటి నీటితో కడుక్కుంటే మీ చర్మం నిగనిగలాడుతుంది.
 
కలబంద రసంలో ముల్తాని మట్టి లేదా చందనం పౌడర్ కలిపి ముఖానికి రాసుకుంటే మీ ముఖం మృదువుగా ఉంటుంది. కలబంద ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా గొప్పగా సహాయపడుతుంది. అనేక చర్మ సంబంధిత సమస్యలకు వాడే వివిధ రకాల ఔషధాలలో కలబందను ఉపయోగిస్తారు. అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడడంలో కలబందలో ఔషద గుణాలు చురుగ్గా పనిచేస్తాయి. చర్మాన్ని మిలమిల మెరిపించి వయసు తగ్గించి చూపే కలబంద అందానికి మేలుచేస్తుంది.
 
చర్మ నిగారింపును మెరుగుపరచడంలో కలబంద గుజ్జును మీ చర్మానికి నేరుగా అప్లై చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. నిమ్మరసంలో కలబంద గుజ్జును కలిపి ముఖానికి అప్లై చేసుకుని అరగంట తరువాత కడిగేసుకుంటే ముఖం కాంతివంతగా మారి మచ్చలు, మెుటిమలు వంటి వాటిని దూరంచేస్తుంది.