మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 1 జూన్ 2018 (20:41 IST)

శనగపిండిలో పాలు కలిపి ముఖానికి రాసుకుంటే?

శనగపిండిలో పాలు కలిపి ముఖానికి రాసుకుని ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో మెల్లగా రుద్దుతూ కడిగితే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఆలివ్ నూనెను ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత కడిగితే మీ ముఖం అందంగా మృదు

శనగపిండిలో పాలు కలిపి ముఖానికి రాసుకుని ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో మెల్లగా రుద్దుతూ కడిగితే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఆలివ్ నూనెను ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత కడిగితే మీ ముఖం అందంగా మృదువుగా కనిపిస్తుంది. అరటిపండు గుజ్జులో పెరుగు, సెనగపిండి, గుడ్డులోని తెల్లని సొన ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకొని బాగా కలిపి ముఖానికి రాసి, అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం మెరుస్తుంది.
 
బొప్పాయి గుజ్జులో కీరదోస రసాన్ని కలిపి అందులో తేనె, గంధపుపొడి, ముల్తాని మట్టి ఒక్కొక్క స్పూన్ వేసి దానిలో కొంచెం పాలు కలిపి పేస్టుగా తయారుచేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత నీటిలో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖంలోని మచ్చలు తొలగిపోతాయి. 
 
రెండు స్పూన్ల బియ్యపు పిండిలో అరస్పూన్ తేనె, కొంచెం చల్లని టీ డికాషన్ కలిపి బాగా కలుపుకుని ముఖానికి రాసి 20 నిమిషాల తరువాత కడిగివేస్తే ముఖం మెరిసిపోతుంది. బంగాళాదుంపను మెత్తని గుజ్జుగా చేసుకుని ముఖానికి పట్టించి 10 నిమిషాలు ఉంచి కడిగేస్తే నల్లటి మచ్చలు తొలగిపోవుటకు తయారపడుతుంది. 
 
నిమ్మరసంలో కొన్ని చుక్కల తేనె కలిపి ముఖానిక పట్టించి అరగండ తరువాత కడిగేస్తే ముఖం మృదువుగా ఉంటుంది. కొబ్బరిపాలను దూదిలో ముంచుకుని ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. దోసకాయ రసంలో కొంచెం నిమ్మరసం, రోజ్‌వాటర్ కలుపుకుని ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత కడుక్కుంటే మంచిది.
 
బార్లీ గింజలు, గసగసాలు పేస్టుగా తయారుచేసుకుని అందులో కొంచెం నిమ్మరసం, రోజ్‌వాటర్ కలిపి ముఖానికి రాసుకుని అరగంట తరువాత చల్లని నీటితో కడిగితే ముఖం అందంగా మెరిసిపోతుంది.