మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 మే 2024 (20:38 IST)

వంగగీత నాకు చెల్లెలు.. ఆమెను డిప్యూటీ సీఎం చేస్తా: జగన్

Vanga Geetha
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన చివరి ఎన్నికల ప్రచార సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో... జగన్ తన చివరి ప్రసంగంలో అక్కడి ఓటర్లకు మరో పెద్ద హామీ ఇచ్చారు.
 
పిఠాపురంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తరఫున తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ మాజీ ఎంపీ, ప్రజారాజ్యం మాజీ ఎమ్మెల్యే వంగగీత పవన్‌ కల్యాణ్‌పై పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా వంగగీతపై జగన్ మాట్లాడుతూ.. "వంగగీత నాకు చెల్లెలు, అమ్మ లాంటిదని, పిఠాపురం నుంచి గెలిస్తే వచ్చే నా ప్రభుత్వంలో ఆమెను డిప్యూటీ సీఎం చేస్తానంటూ" పిఠాపురం ప్రజలకు మరో ఆఫర్ ఇచ్చారు. జగన్ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.