శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 2 జులై 2024 (20:12 IST)

పిఠాపురం పలావ్స్ అండ్ బిర్యానీస్, హైదరాబాదులో హోటళ్లు ప్రారంభం

Pithapuram hotel
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన పిఠాపురం నుంచి పోటీ చేసిన దగ్గర్నుంచి ఆ నియోజకవర్గం విపరీతంగా ట్రెండ్ అవుతూ వస్తుంది. దీనికితోడు ఇటీవల తన నియోజకవర్గం పిఠాపురాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా చేస్తాననీ, దేశం అంతా పిఠాపురం వైపు చూసేలా అభివృద్ధి జరిగేలా సైనికుడిలా పనిచేస్తానని పవన్ కల్యాణ్ అన్నారు.
 
ప్రస్తుతం పిఠాపురంకి వున్న క్రేజ్ దృష్ట్యా ఈ పేరుతో హైదరాబాద్ నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. పిఠాపురం హోటలు పేరు చూసిన ప్రజలు కూడా ఆ హోటల్లోని ఫుడ్ టేస్ట్ చూసేందుకు క్యూ కడుతున్నారు.