శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 24 జులై 2020 (06:51 IST)

రూ.45 కోట్లతో తాడికొండ గురుకుల పాఠశాల అభివృద్ధి కోసం ప్రణాళిక

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ (గుంటూరు) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గుంటూరు జిల్లాలోని ‘రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ తాడికొండ’ సమగ్ర అభివృద్ధి కోసం ఈ పాఠశాల పూర్వ విద్యార్థులతో సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో సమావేశం జరిగింది.

సమావేశంలో  పాఠశాలవిద్య ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, పాఠశాల విద్య సాంకేతిక సలహాదారు ఎ.మురళి, ఆంగ్ల మాధ్యమ ప్రత్యేక అధికారిణి కె.వెట్రిసెల్వి, ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డా.ఎం.ఆర్. ప్రసన్నకుమార్, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

1972లో స్థాపించిన తాడికొండ గురుకుల పాఠశాల సమగ్ర అభివృద్ధి కి దాదాపు రూ.45 కోట్లతో మౌలిక సదుపాయాలు విద్యార్థుల సమగ్ర వికాసానికి, నాణ్యమైన విద్య పొందడానికి తగిన ఏర్పాట్లు కోసం కార్యచరణప్రణాళకను ఈ  సమావేశంలో రూపొందించారు.

పూర్వవిద్యార్థుల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పాఠశాలకు పూర్వవైభవాన్ని తీసుకురావడానికి తీర్మానించడమైనది. 

2022 సంవత్సరం నాటికి ఈ పాఠశాల 50 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా స్వర్ణోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లును ఇప్పటినుండే ప్రారంభించవలసిందిగా పాఠశాల ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ సూచించారు.