శుక్రవారం, 25 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 24 మే 2017 (08:11 IST)

చలపతిరావు - యాంకర్ రవికి తోలుమందం... మహిళా సంఘాల ఫైర్ :: కేసులు నమోదు

సీనియర్ నటుడు చలపతిరావు, టీవీ యాంకర్ రవిలు మదగర్వంతో కొట్టుకుంటున్నారనీ, వారికి తగిన శాస్తి జగరాల్సిందేనంటూ మహిళా సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. నాగచైతన్య - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన 'రారండ

సీనియర్ నటుడు చలపతిరావు, టీవీ యాంకర్ రవిలు మదగర్వంతో కొట్టుకుంటున్నారనీ, వారికి తగిన శాస్తి జగరాల్సిందేనంటూ మహిళా సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. నాగచైతన్య - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన 'రారండోయ్ వేడుకచూద్దాం' ఆడియో వేడుక గత ఆదివారం రాత్రి జరిగింది. 
 
ఈ సందర్భంగా మహిళా యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు చలపతిరావు సమాధానమిస్తూ 'అమ్మాయిలు హానికరం కాదుకానీ.. అమ్మాయిలు పక్కలోకి పనికివస్తారంటూ' సెలవిచ్చారు. ఈ కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. పైగా, చలపతిరావు చేసిన వ్యాఖ్యలు సూపర్ అంటూ కామెంట్స్ చేసి యాంకర్ రవిపై కూడా మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశారు. వీరిద్దరికీ మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదంటూ మండిపడుతున్నారు. 
 
ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ చలపతిరావుతో పాటు రవిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐసీపీ సెక్షన్లు 354ఎ(4), 509 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఫలితంగా జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో చలపతిరావుపై, సరూర్ నగర్ స్టేషన్‌లో రవిపై కేసులు నమోదయ్యాయి.