శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (12:43 IST)

కుప్పం మున్సిపల్ పోరు : దొంగ ఓటర్ల కలకలం - తెదేపా ఆందోళన

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కుప్పం మున్సిపాలిటీకి సోమవారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అధికార వైకాపా భారీ ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను కుప్పంకు తరలించింది. 
 
మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో పోలింగ్ జోరుగా సాగుతోండగా.. దొంగ ఓట్లు కలకలం సృష్టిస్తుంది. కుప్పంలోని 16వ వార్డులో వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. 
 
కుప్పంలో అధికార వైసీపీ బరితెగిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కుప్పంలో వైసీపీ దొంగ ఓటర్లను టీడీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. ఐడీ కార్డు అడిగితే దొంగ ఓటర్లు సమాధానం చెప్పలేకపోతున్నారు.
 
ఈ ఎన్నికల్లో దొంగ ఓటర్లు యధేచ్చగా దొంగ ఓట్లు పోల్ అవుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. బస్సుల్లో సోదాల పేరుతో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని అంటున్నారు.