శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 27 ఆగస్టు 2017 (08:46 IST)

రాజకీయాలు ఒకడ... సొత్తు అనుకుంటే కుదరదు.. నాలాంటోడున్నాడా?: పోసాని

నటుడు పోసాని కృష్ణమురళి రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు ఎవడబ్బ సొమ్ము కాదనే అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. రాజకీయాలు ఒకడబ్బ సొత్తు అనుకుంటే కుదరదని.. ఎవరైనా వచ్చి రాణించవచ్చునని పోసాని అన్న

నటుడు పోసాని కృష్ణమురళి రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు ఎవడబ్బ సొమ్ము కాదనే అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. రాజకీయాలు ఒకడబ్బ సొత్తు అనుకుంటే కుదరదని.. ఎవరైనా వచ్చి రాణించవచ్చునని పోసాని అన్నారు. తనకు మంచివాళ్లను ప్రేమించే పిచ్చ, చెడ్డవాళ్లను తిట్టే పిచ్చ ఉందని, ఇక తనను ఎటువంటి 'మెంటల్ కృష్ణ' అంటారో మీ ఇష్టమని చెప్పాడు. 
 
ఈ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమావాళ్లకు రాజకీయాలు అవసరమా? అనే ప్రశ్నకు.. ఎవడబ్బ సొమ్ము రాజకీయాలు.. తనలా ఎంఏ, ఎంఫిల్ చదివినోడు ఎవడున్నాడని ఎదురు ప్రశ్న వేశారు. ఓ పది మంది పేరు చెప్పండి అంటూ అడిగారు. జనం ప్రేమతో గెలిచిన ఈ ఎమ్మెల్యేలు... అని ఓ పది పేర్లు చెప్పండి. వీళ్లు ఆనెస్ట్ అని" అన్నాడు. సినిమావాళ్లల్లో డ్రగ్స్ బిజినెస్‌ను చేస్తున్న వాళ్లు ఉంటారని తాను అనుకోవడం లేదని పోసాని చెప్పారు.
 
డ్రగ్స్ కేసులో సినీ రంగానికి చెందిన వారితోపాటు ఇతరులనూ కూడా పోలీసులు విచారిస్తున్నారని పోసాని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో సినిమా వాళ్లనే తప్పుగా చూపుతూ మీడియా హైడ్రామా ఆడుతోందని పోసానితో పాటు ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి ఫైర్ అయిన సంగతి తెలిసిందే.