మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 23 ఆగస్టు 2017 (19:38 IST)

తమిళనాడులో రోజాను మించిన ఐరన్ లెగ్... ఎవరు..?

ఆంధ్రలో ఐరన్ లెగ్ అంటే టక్కున సమాధానం చెప్పేస్తారు కొంతమంది. ఆమే రోజా అని. గతంలో ఆమె ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ ఓడి పోతుందనే వాదనలు కూడా వుండేవి. ఐతే ఆ మాటలను రోజా కొట్టి పారేస్తారు. అదలావుంటే సేమ్ ఇలాంటి వ్యక్తే మరొకరు తమిళనాడులో ఉన్నారట. ఆయనెవరో కా

ఆంధ్రలో ఐరన్ లెగ్ అంటే టక్కున సమాధానం చెప్పేస్తారు కొంతమంది. ఆమే రోజా అని. గతంలో ఆమె ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ ఓడి పోతుందనే వాదనలు కూడా వుండేవి. ఐతే ఆ మాటలను రోజా కొట్టి పారేస్తారు. అదలావుంటే సేమ్ ఇలాంటి వ్యక్తే మరొకరు తమిళనాడులో ఉన్నారట. ఆయనెవరో కాదు పన్నీరు సెల్వం.
 
అప్పుడప్పుడూ అదృష్టదేవత పన్నీరు సెల్వంను వరిస్తుంది కానీ ఎప్పుడూ దరిద్రం ఆయన వెన్నంటే ఉంటుందనేది స్పష్టంగా కనిపిస్తోంది. జయలలిత మరణం తరువాత ముఖ్యమంత్రిగా అవకాశమొచ్చినా ఆ అవకాశం కాస్త శశికళ లేకుండా చేసింది. చివరకు పళణిస్వామితో చర్చలు జరిపి ఎలాగోలా ఉపముఖ్యమంత్రితో పాటు ఆర్థిక మంత్రి పదవులు తీసుకుని ప్రశాంతంగా ఉందామనుకుంటున్న తరుణంలో దినకరన్, డిఎంకే పార్టీ రూపంలో పన్నీరుసెల్వాన్ని దరిద్రం వెంటాడుతోంది. సరిగ్గా 24 గంటలు కాకముందే పళణిస్వామి ప్రభుత్వంపై అవిశ్వాసం అంటూ దినకరన్ గ్రూపు కారాలు నూరుతోంది.
 
దీంతో పన్నీరుసెల్వంను కూడా తమిళనాడులో ప్రస్తుతం ఐరన్ లెగ్ అంటున్నారట. ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మీపటలమేనట. గత ఆరునెలల వరకు ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ వచ్చిన పళణిస్వామికి పన్నీరుసెల్వం రూపంలో పెద్ద చిక్కే వచ్చి పడింది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు తయారైంది పళణిస్వామి పరిస్థితి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలోకి పళణిస్వామి వెళ్ళిపోయారు. ఐతే దినకరన్ అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించారు. తను ప్రభుత్వాన్ని పడగొట్టనని చెప్పేశారు. దీనితో మళ్లీ ఓపీఎస్-ఈపీఎస్ వర్గానికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది.