సి.కల్యాణ్ Vs నట్టికుమార్: ఆఫీస్‌బాయ్‌గా పనిచేశాడు.. దొంగతనాలతో పైకొచ్చాడు.. ముగ్గురు హీరోయిన్లతో?
టాలీవుడ్ నిర్మాతలు సి. కల్యాణ్, నట్టికుమార్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎపిసోడ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో.. టాలీవుడ్‌ను కూడా కుదిపేస్తుంది. నయీంతో టాలీవుడ్ ప్రముఖులకు
టాలీవుడ్ నిర్మాతలు సి. కల్యాణ్, నట్టికుమార్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎపిసోడ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో.. టాలీవుడ్‌ను కూడా కుదిపేస్తుంది. నయీంతో టాలీవుడ్ ప్రముఖులకు సంబంధాలు ఉన్నట్లు నిర్మాత నట్టికుమార్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే నట్టి కుమార్ వ్యాఖ్యలపై మరో నిర్మాత సి. కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తాజాగా కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నట్టికుమార్ మళ్ళీ స్పందించారు. ఓ ఛానల్‌తో మాట్లాడిన నట్టికుమార్ సి. కల్యాణ్‌పై కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. నయీమ్‌తో కల్యాణ్‌కు సంబంధాలున్నాయని తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని... తన వ్యాఖ్యలపట్ల వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు.
నీలిచిత్రాల నిర్మాత అంటూ నట్టికుమార్‌ను ఏకిపారేసిన కల్యాణ్‌పై నట్టికుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బ్లూ ఫిలిమ్‌ల కేసులో జైలుకు వెళ్ళొచ్చిన చరిత్ర కల్యాణ్‌దేనంటూ నట్టికుమార్ ఆరోపించారు. ఆఫీస్‌బాయ్‌గా పనిచేసిన కల్యాణ్ అనతి కాలంలోనే కోట్లు ఎలా సంపాదించారని నట్టికుమార్ ప్రశ్నించారు.
దొంగతనాలు చేస్తూనే కల్యాణ్ పైకెదిగాడని ఆరోపించారు. భార్యను చంపిన కేసు ఎవరి మీద ఉందనేది తనకేంటి అందరికీ బాగా తెలుసునని, ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు హీరోయిన్లతో కల్యాణ్‌కు సంబంధాలున్నట్లు కూడా నట్టికుమార్ సెన్సేషనల్ వ్యాఖ్యాలు చేశారు.