మే 7లోపు ప్రొఫెషనల్ అడ్వాన్స్‌మెంట్ టెస్టు పరీక్ష ఫీజు చెల్లించాలి
కర్నూలు జిల్లాలో ప్రొఫెషనల్ అడ్వాన్స్‌మెంట్ టెస్టు పరీక్షలకు జిల్లా పరిషత్, ఎంపీఎల్, ఎయిడెడ్, ప్రాథమిక, ప్రాథమికొన్నత, ఉన్నత పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు మే 7వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలని డీఈవో సాయిరాం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎస్‌జీబీటీ, ఈజీబీటీ, జూనియర్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్-2 అటోమేటిక్ అడ్వాన్సుడ్‌మెంట్ స్కీమ్ ఎగ్జామినేషనర్ ఫర్ గ్రేడ్-2 పండిట్స్, పీఈటీలు, స్పెషల్ టీచర్స్ ఇన్‌క్రాఫ్ట్, టైలరింగ్ సీవింగ్, డ్రాయింగ్, మ్యూజిక్‌కు సంబంధించిన పరీక్షలు మే నెలలో జరుగుతాయని తెలిపారు.
వీటితో పాటు అగ్రికల్చర్ అండ్ రేడియో టెక్నాలజీ, సింపుల్ ఓరియెంటేషన్ టెస్టు ఫర్ గ్రేడ్-1 పండిట్స్‌కు సంబంధించిన పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షకు హాజరు అయ్యే ఉపాధ్యాయులు తమ పరీక్ష ఫీజు అపరాధ రుసుము లేకుండా రూ.200 మే నెల 7వ తేదీలోపు చెల్లించా లని తెలిపారు.
రూ.60 అపరాధ రుసుముతో మే 15లోపు చెల్లించవచ్చని తెలిపారు. పరీక్షలు జరిగే తేదీ వివరాలను త్వరలో తెలియజేస్తామని డీఈవో తెలిపారు.