గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 19 ఏప్రియల్ 2021 (11:40 IST)

రాష్ట్రంలో 3,100 పశువుల ఆస్పత్రులు నిర్మాణం

నాడు-నేడు పథకం ద్వారా రాష్ట్రంలో పశుసంవర్ధకశాఖ ద్వారా 3,100 పశువుల ఆస్పత్రి భవనాలు నిర్మిస్తామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ అమరేంద్రకుమార్‌ తెలిపారు.

మండపేట పశుశిక్షణా కేంద్రానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న చేయూత పథకం ద్వారా రాష్ట్రంలో 1.12 లక్షలు పశువులు, 72,000 గొర్రెలను లబ్ధిదారులకు అందిస్తామన్నారు.

రాష్ట్రంలో రైతులకు పాలకు మెరుగైన ధర అందించేందుకు అమూల్‌పాలు కొనుగోలు కేంద్రా లు 2022, మార్చి నాటికి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే అనంతపురం, చిత్తురు, కడప, ప్రకాశం గుంటూరు జిల్లాల్లో అమూల్‌ పాల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు.

చేయూత ద్వారా అందించే పశువు యూనిట్‌ విలువ రూ.75 వేలు ఉంటుందని, అది పూర్తి గా సబ్సిడీయేనన్నారు. గ్రామాల్లో రైతులు గతంలో నిర్మించుకున్న మినీగోకులాలకు సంబంధించి పెండింగ్‌ బిల్లులు చెల్లింపు 32,000 వరకు ఉన్నాయని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

మినీగోకులాలపై సర్వే నిర్వహిస్తా మని, ప్రస్తుతం ఈ పథకం నిలిచిపోయిందన్నారు. పాలు ఉత్పత్తిలో దేశంలోనే రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందన్నారు.