శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 3 అక్టోబరు 2015 (17:07 IST)

రాష్ట్రమంతటా సైకోలు.. బాపట్లలో తాజాగా విద్యార్థికి సూది మందిచ్చించేందుకు..

రాష్ట్రవ్యాప్తంగా సూదిగాళ్ళు తయారైపోతున్నారు. సిరంజి సైకోలు హడలెత్తిస్తున్నారు. వారిని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారిపోతోంది. పలు జిల్లాల్లో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. మొన్నటి వరకూ తూ.గో, ప.గో. జిల్లాలకు మాత్రమే పరిమితమైన సిరంజి సైకో నిన్న నెల్లూరు జిల్లా నేడు గుంటూరు జిల్లాలో ప్రత్యక్షమయ్యారు. బాపట్ల ప్రాంతంలో ఓ విద్యార్థికి సూది మందిచ్చేందుకు రాగా అక్కడ గుంపుగా విద్యార్థులుండటంతో అతడు పరారయ్యాడు. అతనిని పట్టుకోవడానికి పోలీసులు పరుగులు పెడుతున్నారు. 
 
గుంటూరు జిల్లా బాపట్లలో శనివారం ఉదయం కృష్ణ అనే విద్యార్థి స్కూల్‌కి వెళ్తున్నాడు. సడెన్‌గా బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి విద్యార్థికి ఇంజక్షన్‌ గుచ్చేందుకు ప్రయత్నించాడు. ఐతే అతడు అప్రమత్తమై కేకలు వేయడంతో పాటు సూదిగాడు పరారయ్యాడు. బాపట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.