సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (16:06 IST)

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి : ఏపీలో మూడు రోజులు వర్షాలు

rain alert
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడివుంది. ఇది రాజస్థాన్ వరకు విస్తరించివుంది. దీంతో శుక్ర, శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
 
ఈ నెల 23వ తేదీ నుంచి ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షం నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
అలాగే, వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి పశ్చిమ రాజస్థాన్ వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంటుందని, ఏపీలో దిగువ ట్రోపో ఆవరమంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వివరించింది.