గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 6 జూన్ 2017 (20:01 IST)

చిత్తూరులో వర్షం... దంపతులను పొట్టనబెట్టుకున్న పిడుగు...

తొలకరి జల్లులు మొదలవగానే వాటితో పాటే పిడుగులు కూడా వచ్చేస్తాయి. మబ్బు పట్టినా అప్పటిదాకా బండలు పగిలే ఎండలు వున్నాయి కదా... వర్షం ఏం కురుస్తుందిలే అని చాలామంది పట్టించుకోరు. కానీ ఒక్కసారి మేఘాలు కమ్ముకుని రావడం... వర్షం ముంచెత్తడం దాంతోపాటే పిడుగులు క

తొలకరి జల్లులు మొదలవగానే వాటితో పాటే పిడుగులు కూడా వచ్చేస్తాయి. మబ్బు పట్టినా అప్పటిదాకా బండలు పగిలే ఎండలు వున్నాయి కదా... వర్షం ఏం కురుస్తుందిలే అని చాలామంది పట్టించుకోరు. కానీ ఒక్కసారి మేఘాలు కమ్ముకుని రావడం... వర్షం ముంచెత్తడం దాంతోపాటే పిడుగులు కూడా పడుతుంటాయి. 
 
మంగళవారం నాడు చిత్తూరు జిల్లా బిఎన్ కండ్రిగ మండలం కుక్కంభాకం గ్రామంలో పిడుగు పడి దంపతులను పొట్టనబెట్టుకుంది. చెట్టు కింద పనిచేస్తున్న సమయంలో వర్షం పడటం ప్రారంభించింది. దాన్నేమీ వారు పట్టించుకోలేదు. దీనితో ఒక్కసారిగా ఫెళఫెళమంటూ పెద్ద ఉరుముల శబ్దంతో పిడుగుపడింది. ఈ పిడుగు విద్యుద్ఘాతానికి వారు మరణించారు.