మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 17 ఆగస్టు 2024 (23:52 IST)

రాబోయే రెండు రోజుల్లో ఏపీలో వర్షాలు, పిడుగులు పడే అవకాశం

rain
వాతావరణ శాఖ సూచన ప్రకారం రాబోయే రెండు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని పలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం వుంది. ఉత్తర కర్ణాటక నుంచి తెలంగాణ ప్రాంతంలో ఆవర్తనం విస్తరించి వుందనీ, దీని ప్రభావం వల్ల ఆదివారం నాడు నంద్యాల, ప్రకాశం, ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షం పడే అవకాశం వున్నది.

మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం వున్నదని తెలియజేసారు. ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం వున్నందున ప్రజలు అప్రమత్తంగా వుండాలని, పొలాల్లో పనిచేసేవారు, బహిరంగ ప్రదేశాల్లో తిరిగేవారు పిడుగులు పడే సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.