శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 1 మే 2017 (10:27 IST)

తెలిసిన వాడని ఇంట్లోకి రానిస్తే... వివాహితపై పెళ్లికొడుకు అత్యాచారయత్నం

తన పెళ్లి కార్డు ఇచ్చేందుకు ఇంటికి వచ్చిన ఓ వ్యక్తిని.. తెలిసినవాడని ఇంట్లోకి రమ్మని పిలిస్తే.. ఇంట్లో ఎవరూ లేరన్న విషయాన్ని పసిగట్టి ఓ మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్, శంషాబాద్ మండలంల

తన పెళ్లి కార్డు ఇచ్చేందుకు ఇంటికి వచ్చిన ఓ వ్యక్తిని.. తెలిసినవాడని ఇంట్లోకి రమ్మని పిలిస్తే.. ఇంట్లో ఎవరూ లేరన్న విషయాన్ని పసిగట్టి ఓ మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్, శంషాబాద్ మండలంలో ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతి (23) వివాహం గతేడాది అదే మండలానికి చెందిన వ్యక్తితో జరిగింది. అయితే ఆమె స్వగ్రామానికి చెందిన స్నేహితుడు శ్రీనివాస్ అనే వ్యక్తికి పెళ్లి కుదిరింది. దీంతో యువతి అత్తింటివారికి శుభలేఖ ఇచ్చేందుకు శ్రీనివాస్ ఇంటికి వచ్చాడు. 
 
తెలిసినవాడే కదా అని శ్రీనివాస్‌ను ఆ యవతి ఇంట్లోకి ఆహ్వానించింది. అయితే ఆమె ఇంట్లో ఒంటరిగా ఉందని, ఆమె అత్తారింటివారు ఎవరూ లేరని పసిగట్టిన శ్రీనివాస్ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో అతను పరారయ్యాడు. దీనిపై ఆమె శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.