ఓయో ప్రైవసీ రూమ్స్... ప్రేమ జంటలు... పెళ్ళికాని వారి కోసం కూడానా...?
హైదరాబాద్: పెళ్లి కాని వాళ్ళు... ప్రేమ జంటలు ప్రైవసీ కోసం పాట్లు పడుతుంటారు. పార్కుల్లో చెట్టులు, పుట్టల చాటున రొమాన్స్ చేస్తుంటారు. అలాంటి వారి కష్టాలు ఇక తీరినట్టే. పార్కులు ఇతరత్రా ప్రాంతాలకు ప్రైవసీ కోసం వెళ్లనవసరం లేదు. పోలీసు రైడింగుల ఆందో
హైదరాబాద్: పెళ్లి కాని వాళ్ళు... ప్రేమ జంటలు ప్రైవసీ కోసం పాట్లు పడుతుంటారు. పార్కుల్లో చెట్టులు, పుట్టల చాటున రొమాన్స్ చేస్తుంటారు. అలాంటి వారి కష్టాలు ఇక తీరినట్టే. పార్కులు ఇతరత్రా ప్రాంతాలకు ప్రైవసీ కోసం వెళ్లనవసరం లేదు. పోలీసు రైడింగుల ఆందోళన లేదు. ఎంచక్కా ఓయో హోటళ్లను బుక్ చేసుకోవచ్చు. రొమాన్స్‌కు ఓయో అన్ని సదుపాయాల్ని కల్పిస్తోందట.
ఇప్పటివరకు కొన్ని మెట్రో నగరాల్లో మాత్రమే పరిమితమైన ఓయో సేవలు ఇపుడు దేశ వ్యాప్తంగా 200 నగరాలకు విస్తరించారు. ఓయో 70 వేల హోటళ్లను బుక్ చేసుకుంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, కరీంనగర్, వరంగల్ సహా పలు పట్టణాలకు ఓయో సేవల్ని విస్తరించింది.
ప్రస్తుతం హోటళ్లు బుక్ చేసుకునే సమయంలో ఆధార్... ఇతర ఫోటో ఐడీలతో పాటు రకరకాల ఆధారాలు అడుగుతారు. ఆడ, మగ వెళితే అనుమానంగా చూస్తారు. సవాలక్ష ప్రశ్నలు వేసి రూమ్ ఇవ్వడానికి నిరాకరిస్తారు. అన్ని ఐడీలు ఇచ్చినా పోలీసుల రైడింగ్ ఆందోళన వెంటాడుతుంది. ఇలాంటి కష్టాలు లేకుండా ఆన్‌లైన్ లోనే ఓయో హోటల్ రూంలను బుక్ చేసుకుని, ఓయో ప్రైవసీ రూంలను ఇవ్వనుంది. ఆ మేరకు ప్రభుత్వం నుంచి ఓయో అనుమతులు తెచ్చుకున్నదట.