శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 7 డిశెంబరు 2019 (09:02 IST)

రాజధానిపై ఈ నెల 20-25 మధ్య ప్రభుత్వానికి నివేదిక?

రాజధానితో పాటు రాష్ట్ర ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన ప్రొఫెసర్‌ కె. రవీంద్రన్‌- జీన్ రావ్‌ కమిటీ... ఈ నెల 20 నుంచి 25 మధ్య తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.

రాజధానితో పాటు రాష్ట్ర ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన ప్రొఫెసర్‌ కె. రవీంద్రన్‌- జీన్ రావ్‌ కమిటీ... ఈ నెల 20 నుంచి 25 మధ్య తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. అనంతరం జనవరి 15లోగా రాజధానిపై ప్రభుత్వం స్పష్టతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నివేదిక రూపకల్పనలో భాగంగా రాజధాని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించటంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలను, సలహా సూచనలను కమిటీ స్వీకరించింది.

ఇప్పటికే నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికను సీఎం జగన్‌కు అందచేసింది. రాజధానిపై ఆర్థిక మంత్రి బుగ్గన నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కమిటీ సైతం అధ్యయనం చేస్తోంది. ఈ రెండు కమిటీల నివేదికల ఆధారంగా జనవరి 15లోగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశముంది.

మరోవైపు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి బొత్స... సీఎం ఆదేశాల మేరకు అమరావతిలో 50శాతం కంటే ఎక్కువ పూర్తైన పనులపై ముందుకు వెళ్లాలన్నారు.