మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 మార్చి 2017 (15:36 IST)

పళనిస్వామి ఎమ్మెల్యేలకు మూడింది.. అవినీతి చిట్టా విప్పుతామన్న.. ఓపీఎస్ అండ్ కో..!

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం తమిళనాట అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేసి.. ఎమ్మెల్యేలకు కాసు ఎరచూపి.. ప్రస్తుతం జైలులో ఊచలు లెక్కిస్తున్న శశికళ వర్గంలోని అవినీతి మంత్రుల బండారం బయటపె

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం తమిళనాట అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేసి.. ఎమ్మెల్యేలకు కాసు ఎరచూపి.. ప్రస్తుతం జైలులో ఊచలు లెక్కిస్తున్న శశికళ వర్గంలోని అవినీతి మంత్రుల బండారం బయటపెడుతామని ఓపీఎస్ వర్గం హెచ్చరిస్తోంది.

శశికి సపోర్ట్ చేసి.. సీఎం పళనిస్వామికి మద్దతిచ్చిన మంత్రులందరూ అవినీతిలో కూరుకుపోయిన వారేనని మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గాలు ఆరోపించారు. త్వరలోనే శశిని వెనకేసుకొచ్చిన పది మంది అవినీతి మంత్రుల జాతకాలను విడుదల చేస్తామని బాంబు పేల్చారు. ఇంకా వారిని ప్రజల ముందు దోషులుగా నిలబెడుతామన్నారు. 
 
ఆర్‌కే నగర్ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో పన్నీర్ సెల్వం వర్గంలోని మధుసూదనన్‌కు మద్దతుగా ఓపీఎస్ వర్గంలోని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓపీఎస్ వర్గం నేతలు మాట్లాడుతూ.. ఎడప్పాడి పళని స్వామి సర్కారులోని పది మంది అవినీతి మంత్రుల బండారాన్ని బయటపెడతామన్నారు. మంత్రుల అవినీతి గురించి సరైన ఆధారాలతో బయటికి వస్తామని చెప్పారు.