శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 19 నవంబరు 2016 (15:36 IST)

చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టే ఆ విలువ తెలియదు: రోజా

కర్నూలు జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఉషారాణి చనిపోయి ఒకరోజు గడవక ముందే మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. ఏపీలో విద్యార్థులు పిట్టల్

కర్నూలు జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఉషారాణి చనిపోయి ఒకరోజు గడవక ముందే మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. ఏపీలో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ..  అఘాయిత్యాలు, అరచకాలు, ఆత్మహత్యలల్లో ఏపీ నెంబర్‌-1 అని అన్నారు.
 
మహిళల కన్నీటిలో చంద్రబాబు ప్రభుత్వం కొట్టుకుపోతుందని అన్నారు. ఉషారాణి ఆత్మహత్యలపై స్పందించాల్సిన మంత్రి గంటా శ్రీనివాసరావు విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. గంటాను వెంటనే కేబినెట్‌ నుంచి తొలగించాలని రోజా డిమాండ్‌ చేశారు. 
 
విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం వేసిన కమిటీ ఏమైందని రోజా సూటిగా ప్రశ్నించారు. కార్పొరేట్‌ విద్యాసంస్థల ఆరాచకాలను ప్రభుత్వం ఎందుకు అరికట్టడం లేదని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టే ఆ విలువ తెలియదని రోజా వ్యాఖ్యానించారు.