మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2024 (15:15 IST)

అసెంబ్లీకి వెళ్లలేం.. కనీసం ఫారిన్ ట్రిప్ అయినా వెళ్దాం.. గౌనులో రోజా!

Roja
Roja
2024 ఎన్నికల్లో నగరి ఎమ్మెల్యే సీటులో భారీ తేడాతో సినీ నటి ఆర్కే రోజా ఓడిపోయారు. తాజాగా రోజా విదేశాలకు వెకేషన్ వెళ్లిపోయారు. ప్రస్తుతం రోజా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో నగరి మాజీ ఎమ్మెల్యే రోజా గౌను ధరించి కనిపించారు.
 
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేనాని పవన్‌లను తిట్టడంలో రోజా చాలా సార్లు హద్దులు దాటారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఆమెకు స్థానం దక్కకపోవడంతో.. ఆ టైమ్ వేస్ట్ చేసుకోకుండా.. విదేశాలకు బయల్దేరారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.