శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (15:21 IST)

గౌతమ్ రెడ్డి చెల్లెలిగా చూసేవారు... ఆయనో బాహుబలి

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మంత్రి గౌతమ్ రెడ్డి మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. గౌతమ్‌రెడ్డి గురించి ఇలా మాట్లాడాల్సి రావడం ఎంతో దురదృష్టకరం.. ఆయన ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. 
 
జగనన్న క్యాబినెట్‌లో గౌతమ్ అన్న మంత్రిగా ఉన్న ఈ సమయంలో రెండేళ్ల పాటు, నేను ఏపీఐఐసి ఛైర్‌పర్సన్‌గా ఉన్నాను. నన్ను ఎప్పుడూ ఒక చెల్లిగా చూసేవారు. నన్ను ఎప్పటికప్పుడు గైడ్‌ చేసే వారు. ఆయన ఒక బాహుబలి.
 
అలాంటి వ్యక్తి క్షణాల్లో మాయమయ్యారు... అని రోజా తెలిపారు. గౌతమ్ అన్న ఒక మంత్రిగానే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా సక్సెస్ పర్సన్ అని కన్నీటి పర్యంతం అయ్యారు.