కామాంధులకు అడ్డాగా కడప కార్పొరేషన్ కార్యాలయం... చాంబర్లలో రాసలీలలు
కడప కార్పొరేషన్ కార్యాలయం కామాంధులకు అడ్డాగా మారింది. ఈ కార్యాలయంలోని చాంబర్లలో రాసలీలలు యధేచ్చగా సాగుతున్నాయి. దీంతో చాంబర్‌ల పక్కన పనిచేస్తున్న ఇతర ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారింది.
కడప కార్పొరేషన్ కార్యాలయం కామాంధులకు అడ్డాగా మారింది. ఈ కార్యాలయంలోని చాంబర్లలో రాసలీలలు యధేచ్చగా సాగుతున్నాయి. దీంతో చాంబర్‌ల పక్కన పనిచేస్తున్న ఇతర ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారింది. ఒక్కొక్కసారి ఏదైనా పనిమీద చాంబర్‌లోకి వెళ్లినపుడు సహోద్యోగులకు రాసక్రీడల దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో వారు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
కడప మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేశారు. దీంతో పదుల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు మంజూరయ్యాయి. ఉన్న స్థలంలోనే అందరు ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించారు. ఇందుకోసం రూ.లక్షలు వెచ్చించి అల్యూమినియంతో చిన్న చిన్న చాంబర్లు ఏర్పాటు చేశారు. ఇపుడు ఈ చాంబర్లే కేటాయింపే పెద్ద తప్పిదంగా మారిపోయింది. ఈ చాంబర్లలో పలువురు ఉద్యోగులు తమ కింది స్థాయి ఉద్యోగులతో రాసలీలలు కొనసాగిస్తున్నారు.
కార్పొరేషన్ కార్యాలయంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో రెండు చాంబర్లలో, రెండో అంతస్తులోని ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఒక చాంబర్‌లో రాసలీలలు సాగుతున్నట్లు తోటి ఉద్యోగులే చెవులు కొరుక్కుంటున్నారు. మూడు చాంబర్లలో ఇద్దరు అధికారులు, ఒక జూనియర్ అసిస్టెంట్ రాసక్రీడలను సాగిస్తున్నారనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. దీంతో చాంబర్‌ల పక్కన పనిచేస్తున్న ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారింది. ఇంత జరిగినా ఈ వ్యవహారం మాత్రం కార్పొరేషన్ ఛైర్మన్ దృష్టికి వెళ్లకపోవడం గమనార్హం.