శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 మే 2017 (09:43 IST)

చెప్పిన టైమ్‌కు నా గదికి వచ్చి నా కోర్కె తీర్చు.. లేదంటే నీ ఫ్యామిలీ హతం...

హైదరాబాద్ నగరంలో ఓ 23 యేళ్ల రౌడీ కేటుగాడు ఓ మహిళను లైంగికంగా వేధించాడు. "నేను చెప్పిన టైమ్‌కు నా గదికి వచ్చిన నా కోర్కె తీర్చాలి. లేదంటే నీ కుటుంబ సభ్యులందరినీ హత్య చేస్తా"నంటూ బెదిరించాడు. చివరకు ఆ మ

హైదరాబాద్ నగరంలో ఓ 23 యేళ్ల రౌడీ కేటుగాడు ఓ మహిళను లైంగికంగా వేధించాడు. "నేను చెప్పిన టైమ్‌కు నా గదికి వచ్చిన నా కోర్కె తీర్చాలి. లేదంటే నీ కుటుంబ సభ్యులందరినీ హత్య చేస్తా"నంటూ బెదిరించాడు. చివరకు ఆ మహిళ ధైర్యం చేసిన షీ టీమ్స్ పోలీసులకు చెప్పడంతో ఆ రౌడీ కేటుగాడు కటకటాలపాలయ్యాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్‌ నగరానికి చెందిన 35 ఏళ్ళ మహిళను కోరిక తీర్చాలంటూ 22 ఏళ్ళ యువకుడు వెంటబడ్డాడు. తన కోర్కె తీర్చకపోతే ఆమెతోపాటు ఆమె కుటుంబసభ్యులను చంపేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. ఆమె నిరాకరించింది. కానీ, యువకుడు మాత్రం వదలిపెట్టలేదు. తరచూ అసభ్య సందేశాలు పంపుతూ భయబ్రాంతులకు గురిచేశాడు. చివరకు ఆ మహిళ తన స్నేహితురాలి సహాయంతో హైదరాబాద్ షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది.
 
దీంతో రంగంలోకి దిగిన షీ టీమ్స్ పోలీసులు... దర్యాప్తు చేపట్టగా ఉప్పల్, విజయపురి కాలనీకి చెందిన ఓ కాల్ సెంటర్ ఉద్యోగి రమేష్ రెడ్డి ఈ వేధింపులకు పాల్పడుతున్నట్టు గుర్తించి అరెస్టు చేశారు. కోరికతీర్చకపోతే చంపేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ రకంగా వేధిస్తున్న 23 మందిని పోలీసులు అరెస్టు చేశారు.