ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (09:57 IST)

ఆ గ్రామంలో ఓటుకు రూ.40 వేలు !

ఓటుకు వెయ్యి, రెండు, ఐదు వేలు ఇవ్వడం విన్నాం. కానీ ఒక ఓటుకు ఏకంగా రూ.40 వేలు ఇస్తున్నారంటే నమ్మగలరా?.. కానీ నమ్మాల్సిందే. అదెక్కడ అంటారా?.. అయితే పశ్చిమ గోదావరి జిల్లా వెళ్దాం రండీ...
 
ఉండి మండలంలోని ఓ చిన్న గ్రామంలో ఓటర్ల సంఖ్య వెయ్యిలోపే ఉంది. గ్రామంలో ఓటర్ల సంఖ్య తక్కువ కావడంతో.. ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లకు పెద్ద మొత్తంలోనే ముట్టజెప్పుతున్నారు.

ఎన్నికల వేళ.. ఆ గ్రామంలోని ఓటర్లకు పండగనే చెప్పాలి. గ్రామంలో ఎన్నికల బరిలో నిలిచిన ఇద్దరు సర్పంచి అభ్యర్థులు.. రెండు విడతల్లో ఓటుకు రూ.10 వేల చొప్పున పంచారు.

ఇదే గ్రామంలో ఉప సర్పంచి పదవి పోటీలో తలపడుతోన్న మరో ఇద్దరు అభ్యర్థులు ఒకే వార్డులో బరిలో నిలిచారు. ఆ వార్డులో కేవలం 110 మంది ఓటర్లే ఉండగా, వీరిద్దరూ చెరొక రూ.10 వేల వరకు ఓటర్లకు ముట్టజెప్పారు. మొత్తంగా ఆ వార్డులో ఓటుకు రూ.40 వేల చొప్పున అందాయి.