శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (12:19 IST)

పంచాయతీ ఎన్నికల ఓటర్ల కోసం విమాన టిక్కెట్లు

ఓటు ఉండి వేరే ప్రాంతాల్లో ఉంటున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. ఆ ఊరిలో ఉంటున్న బంధువుల ద్వారా ఆ ఓటర్ల వివరాలను సేకరించి మొబైల్ నంబర్లు తీసుకొని కాల్ చేసి మాట్లాడుతున్నారు. ఎన్నికల రోజు వచ్చి తమకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని ఓ గ్రామంలో ప్రధాన పార్టీల మద్దతుదారులు సర్పంచి ఎన్నికల్లో పోటీ చేశారు. 
 
ఓట్లు కీలకం కావడంతో ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారిని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, ముంబై, లక్నో, కోల్‌కతా, పుణె.. ఇలా ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఉన్నవారు వచ్చి ఓటు వేసి తిరిగి వెళ్లటానికి విమానం, రైలు టిక్కెట్లు బుక్‌ చేసి పంపారు.
 
అంతేకాదు ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్ల నుంచి సొంతూరు రావటానికి కార్లు పంపిస్తున్నారట. మరికొందరు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారి కోసం ఏకంగా కారు కారు బుక్‌ చేశారట. ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఓటర్లను రప్పించటానికి ప్రయాణ ఖర్చులు రూ.వేలు ఖర్చవుతున్నా భరించటానికి రెడీ అంటున్నారు