గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 24 మార్చి 2021 (12:28 IST)

ఇసుక ఉచితంగా ఇవ్వాలి:సోమువీర్రాజు

ఇళ్లు నిర్మించుకునే మధ్యతరగతి ప్రజలకు ఇసుకను ఉచితంగా ఇవ్వాలని, జేపీ పవర్‌కు కట్టబెట్టిన ఇసుక వ్యాపార కాంట్రాక్టును తక్షణం రద్దుచేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు రాష్ట్ర
ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అమలుచేస్తున్న నాలుగో ఇసుక పాలనీని వ్యతిరేకిస్తూ, దానిని రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ అన్ని కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాల ముందు ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయం ముందు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు పాల్గొని ప్రసంగించారు.

ఆయన మాట్లాడుతూ, తెదేపా ప్రభుత్వ హయాంలో బియ్యానికంటే ఇసుక ధర ఎక్కువ పలికిందని, దీంతో ప్రజలు నష్టపోయారన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఇసుక ఆన్‌లైన్‌లో దొరక్క బ్లాక్‌ లభిస్తుందని, బంగారం కంటే ధర పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు.

ఇళ్ల నిర్మాణం జరక్క 30 లక్షల మంది భవననిర్మాణకార్మికులు, పరోక్షంగా మరో 20 లక్షల మంది ఉపాధి కోల్పోయారని ఆవేదన చెందారు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా నిర్మాణ కార్మికుల వేదన వింటూ బాధపడాల్సి వస్తోందన్నారు.