షాకింగ్, మహిళా ఉద్యోగినుల గ్రూపులో బ్లూఫిల్మ్‌లు, పైగా డిలిట్ మీ కొట్టాడు
తిరుపతి నగర పాలకసంస్థలో బ్లూ ఫిల్ములు ఘటన కలకలం రేపుతోంది. కమిషనర్, ఉపకమిషనర్‌తో పాటు అదనపు కమిషనర్ ఉన్న వాట్సాప్ గ్రూపులో పోర్న్ సైట్లు వేశాడు ఒక శానిటరీ సూపర్‌వైజర్. ఇది కాస్త పెద్ద కలకలమే రేగింది. ఆ ఫోటోలు, వీడియోలు చూసిన మహిళా ఉద్యోగులు అవాక్కయ్యారు.
శానిటరీ సూపర్‌వైజర్ తను చూస్తున్న పోర్న్ ఫోటోస్, వీడియోలను తెలియకుండా తమ గ్రూపులో పోస్ట్ చేసేశాడు. సహచర ఉద్యోగులు చూసి అతనికి ఫోన్ చేశారు. వెంటనే డిలీట్ చేయమన్నారు. వాట్సాప్‌లో డిలీట్ ఆల్ కొడితే వెంటనే అవి డిలీట్ అయిపోతాయి ఎవరికీ కనిపించవు.
కానీ అతను డిలీట్ ఫర్ మి కొట్టాడు. దీంతో అతనికి మాత్రమే కనిపించకుండా పోయింది లింక్. కానీ నగర పాలకసంస్ద వాట్సాప్ గ్రూపులో మాత్రమే అలాగే ఉండిపోయింది. ఇది కాస్త వైరల్ కావడంతో కమిషనర్ సీరియస్ అయ్యారు. బాధితుడిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.