బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 10 ఆగస్టు 2020 (18:37 IST)

అమర సైనికులు, స్వాతంత్య్ర సమర యోధులకు నివాళిగా ఆన్‌లైన్‌లో దాల్మియా భారత్ గ్రూప్ సంగీత కచేరీ

భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆగస్టు 14వ తేదీ సాయంత్రం 6.15 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ ఆన్‌లైన్‌లో ఓ సంగీత కచేరీని నిర్వహించబోతుంది దాల్మియా భారత్ గ్రూప్.
 
భారతదేశ స్వాతంత్య్ర సమరయోధులతో పాటుగా మువ్వెన్నల భారత కీర్తి పతాకను రెపరెపలాడించేందుకు తమ ప్రాణాలనే అర్పించిన అమర వీరులకు నివాళులర్పించేందుకు 'జజ్బా-ఈ-భారత్' శీర్షికన ఈ సంగీత కచేరీని నిర్వహించబోతున్నారు. 
 
కోవిడ్-19తో పోరాటంలో దాల్మియా గ్రూప్ యొక్క స్ఫూర్తిని వేడుక చేయడంతో పాటుగా సంస్థ విలువలు, లక్ష్యం సైతం ఇది ప్రదర్శించనుంది. సుప్రసిద్ధ గాయకులు కైలాష్ ఖేర్, రిక్కీ కేజ్‌లు ఈ ఆన్‌లైన్ సంగీత కచేరీలో తమ గానామృతం వినిపించనున్నారు. ఈ సంగీత కచేరీని ఆస్వాదించేందుకు dblconcert.com వెబ్‌సైట్‌కు వెళ్లి తమ పేర్లను నమోదు చేసుకోవడంతో పాటుగా ప్రత్యక్షంగా తిలకించవచ్చు.