గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 డిశెంబరు 2021 (15:19 IST)

విశాఖలో ముందుకు వచ్చిన సముద్రం.. కోతకు గురైన విశాఖ ఆర్కే బీచ్

విశాఖపట్టణంలో ప్రముఖ ఆర్కే బీచ్‌లో సముద్ర ముందుకు వచ్చింది. అలాగే, తీర ప్రాంతం సముద్రపు అలలకు భారీగా కోతకు గురైంది. ఆర్కే బీచ్ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు దాదాపు 200 మీటర్లకు పైగా తీరం కోతకుగురైంది. అంతేకాకుండా సముద్రపు తీరం ఒడ్డున నిర్మించిన రహదారి మార్గం కూడా కోతకు గురైంది. 
 
ఆర్కే బీచ్‌తో పాటు.. సమీపంలోని చిన్నపిల్లల పార్కులో పది అడుగుల మేరకు భూమి కుంగిపోయింది. ఫలితంగా పార్కులోని బల్లలు, ఇతర సామాగ్రి విరిగిపోయింది. సమాచారం తెలుసుకున్న విశాఖ మున్సిపల్ అధికారులు అటుగా ఎవరినీ వెళ్ళనీయకుడా బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసులను బందోస్తుగా నియమించారు.