శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , సోమవారం, 29 నవంబరు 2021 (11:57 IST)

వెంకన్న పాదాల చెంత జీవించిన అదృష్టం ఆయనది: స్వరూపానందేంద్ర స్వామి

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో ద‌శాబ్దాల‌పాటు వెంక‌న్న సేవ‌లో పునీత‌మైన తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి మృతికి ప‌లువురు సంతాపం తెలుపుతున్నారు. గ‌తంలో వివాదాస్ప‌ద‌మైన డాల‌ర్ శేషాద్రి, వాట‌న్నింటికీ ఎదుర్కొని, శ్రీవారి సేవ‌లో నిలిచి, ఇపుడు విశాఖ‌లో స్వామివారి ఉత్స‌వాల ఏర్పాట్లుకు వ‌చ్చి, కార్తీక స‌మారాధ‌న కార్య‌క్ర‌మంలో త‌నువు చాలించినందుకు అంతా తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

 
తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి మరణం తనను కలచివేసిందని శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి అన్నారు. నిత్యం వేంకటేశ్వర స్వామి పాదాల చెంత జీవించిన అదృష్టం ఆయనదని చెప్పారు. వెంకన్నను దర్శించుకున్న ప్రతి ఒక్కరికీ డాలర్‌ శేషాద్రి సుపరిచితులన్నారు. ఆయన ఆప్యాయతను పొందినవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని చెప్పారు. డాలర్‌ శేషాద్రితో విశాఖ శారదా పీఠానికి సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. ఆయన మహా విష్ణువు హృదయంలో చేరాలని ఆశిస్తున్నట్లు స్వరూపానందేంద్ర స్వామి చెప్పారు.