శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 19 జులై 2024 (12:12 IST)

వినుకొండకు మాజీ సీఎం జగన్... 144 సెక్షన్ అమలు!!

Jagan
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పల్నాడు జిల్లా వినుకొండకు వస్తున్నాు. నడి రోడ్డుపై దారుణ హత్యకు గురైన వైకాపా కార్యకర్త రషీద్ మృతదేహానికి నివాళులు అర్పించి, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి కీలక ప్రకటన జారీ చేశారు. జగన్ పర్యటన నేపథ్యంలో వైకాపా నేతలు ఎలాంటి జన సమీకరణలు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా, వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఐజీ తెలిపారు. 
 
అందువల్ల పట్టణంలో ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని చెప్పారు. మృతుడు రషీద్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించవచ్చని, కానీ జనసమీకరణతో ప్రదర్శనలు చేయరాదని స్పష్టం చేశారు. మరోవైవు, వినుకొండలో ప్రస్తుతం ప్రశాంతమైన పరిస్థితి ఉందని, అనవసరంగా రోడ్లపైకి వచ్చిన శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మరోవైపు, జగన్ పర్యటన నేపథ్యంలో వినుకొండలో భారీ పోలీస్ భద్రతను కల్పించారు. ఇందుకోసం 400 మంది పోలీసులను మొహరించారు.