మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 9 జనవరి 2021 (20:17 IST)

రూ. కోటి విలువ చేసే గంజాయి స్వాధీనం

విజయవాడ నగరంలో కోటి రూపాయల విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ రామవరప్పాడు వద్ద తనిఖీలలో వెయ్యి కిలోల గంజాయి పట్టుబడింది.

గంజాయిని విశాఖ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.