ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 6 ఏప్రియల్ 2017 (10:27 IST)

చిలక్కు చెప్పినట్టు చెప్పా..విన్నావా అనితా.. పగలబడి నవ్వుతున్న రోజా..

ఏపీలో మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత అందరికంటే విషాదంలో మునిగిపోయింది ఎవరూ అంటే సమాధానం అనిత. అందరికంటే సంతోషంగా ఉంటోంది రోజా. ఒకరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాగా మరొకరు వైకాపా ఎమ్మెల్యే.

ఏపీలో మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత అందరికంటే విషాదంలో మునిగిపోయింది ఎవరూ అంటే సమాధానం అనిత. అందరికంటే సంతోషంగా ఉంటోంది రోజా. ఒకరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాగా మరొకరు వైకాపా ఎమ్మెల్యే. నామీదకు ఎగిరితే ఎగిరావు, నన్ను అసెంబ్లీనుంచి సస్పెండ్ చేయించావు, సంవత్సరం పాటు చంద్రబాబు ఉసిగొల్పిన శివంగిలా నా మీద పడ్డావు. నమ్మకు .. బాబును నమ్మకు.. నన్ను వాడుకున్నట్లే నిన్నూ వాడుకున్నంత సేవు వాడుకుని కరివేపాకులా పారేస్తాడు.. కాస్త తగ్గు..  అని మొత్తుకుంటే విన్నావా అనితా.. అందుకే  అనుభవించు అన్నది రోజా సంతోషానికి కారణం. ఇక రోజాను ఎంత గట్టిగా అడ్డుకుంటే అంత త్వరగా మంత్రి పదవి గ్యారంటీ అని ఆశలు చూపిన చంద్రబాబు చివరకు నాకు మంత్రిపదవి ఇవ్వుకుండా ఎగనామం పెట్టేశాడే అనే బాధ అనితది.
 
అనిత విశాఖపట్నం జిల్లా పాయకరావు పేట టీడీపీ శాసనసభ్యురాలు. సంవత్సరం పైగా ఏపీ ప్రజల్లో ఆమె పేరు నానుతూనే ఉంది. కారణం వైకాపా ఎంఎల్ఎ రోజాతో నిత్య ఘర్షణ. రోజాను అసెంబ్లీనుంచి గెంటించిన ఘనత కూడా ఆమెదే. టీడీపీలో ఏ మహిళా ఎమ్మెల్యేకి సాధ్యం కానంతగా అనిత వెలిగిపోయింది నిజమే. రోజాపై దూకుడుగా సాగించిన దాడి ప్రభావం అది. సంవత్సర కాలంగా అనిత వార్తల్లో లేకుండా ఏపీ రాజకీయాల్లో ఒక్కరోజు కూడా గడవలేదు అంటే అతిశయోక్తి కాదు.
 
 
వాస్తవానికి రెండో సంవత్సరం కూడా అసెంబ్లీ నుంటి సస్పెన్షన్ కాకుండా ఉండాలంటే అనితకు క్షమాపణ చెప్పు చాలు అని టీడీపీ నేతలు రోజాను డిమాండ్ చేశారంటే  అనిత ఎంతగా వెలిగిపోయిందో అర్థమవుతుంది. పైగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో ఫైటింగ్ చేయాలన్నా అనితకే సాధ్యం మరి. 
 
వాస్తవానికి తన పనితనం చూసి చంద్రబాబు ఇంప్రెస్ అవుతారని ఈసారి మంత్రినయ్యే ఛాన్సు మొదట తనకే ఇస్తారని అనిత బాగా ఆశపడ్డారు. ఆశించినట్లే ఒక దశలో ఆమె పేరు కొత్త మంత్రుల జాబితాలోకి ఎక్కేసిందని వార్త కూడా వచ్చేసింది. ఇంకేం అనిత తన కష్టాలకు ప్రతిఫలం దక్కిందని మేఘాల్లో తేలిపోయారు. కానీ తీరా విస్తరణ సమయానికి ఆమె పేరు ఎగిరిపోయింది. అనితకు మామూలు నిరాశ కాదు. నిజంగానే కుంగిపోయారు. 
 
ఇలా అవుతుందని ఏపీలో అందరికంటే బాగా గ్రహించింది రోజానే. చంద్రబాబు నాయుడి నుంచి మరీ ఎక్కువగా ఆశించకు అని రోజా తనతో అసెంబ్లీలో ఘర్షణ పడుతున్న అనితను హెచ్చరించారు కూడా. సరిగ్గా రోజా చెప్పినట్లే జరిగింది. కరివేపాకులా అనిత వాడిన చంద్రబాబు చివరకు ఆమె ప్లేస్ ఎక్కడో, ఏదో చూపించేశారు. 
 
పాపం అనితకు దక్కింది చింతే మరి. ఆ చింతలోనూ గొప్ప ఉపశమనం ఏమిటంటే తనకంటే సీనియర్ మోస్ట్ నేతలకుకూడా బాబు మంత్రిపదవులు ఇవ్వలేదు కదా.. వారితో పోలిస్తే నాదెంత అంటూ సమాధనపడుతున్నారీ పాయకరావు ఎమ్మెల్యే