సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 4 జనవరి 2019 (11:04 IST)

షాకింగ్... వైసీపీ లోకి పవన్ కళ్యాణ్ ఆప్త మిత్రుడు అలీ..

ఇది పవన్ కళ్యాణ్‌కు షాకింగ్ వార్తే. పవన్ ఆప్తమిత్రుడునని చెప్పుకునే అలీ ఈ నెల 9న జగన్ పాదయాత్ర ముగింపు సంధర్భంగా ఇచ్చాపురంలో వైసీపి కండువా కప్పుకోనున్నాడు. డిసెంబర్ 28 శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జగన్‌‍‌ను‌ అలీ కల్సిన సంగతి తెలిసిందే. 
 
దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత రాజకీయాల్లో సెంకడ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన అలీ పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధమంటున్నాడు. మరి పవన్ కళ్యాణ్‌కు అత్యంత ఆప్త మిత్రడుగా పేరొందిన ఆలీ జనసేనలో గాకుండా వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం విశేషం. అన్నట్లు బండ్ల గణేష్ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ ఓటమి పాలయితే బ్లేడుతో గొంతు కోసుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే. మరి అలీ ఎలాంటి కామెంట్లు చేస్తారో చూడాలి.