గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (15:36 IST)

ప్రియుడితో ఏకాంతంగా ఉన్న వీడియోను భర్తకు చూపించిన భార్య... ఎందుకు?

ప్రేమలో పడటం తప్పు కాదు. ఇది సహజం. కానీ ప్రేమ పెళ్ళి చేసుకోవడం చాలా అరుదు. కానీ ఈ సంఘటన మాత్రం ప్రేమించి మోసగించిన ఒక యువకుడి కథ. పశ్చిమ గోదావరిజిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన రూపేష్‌, అవనిజలు ప్రేమించుకున్నారు. అవనిజ, రూపేష్‌‌లు ఇద్దరూ బిటెక్ చదువుతూ

ప్రేమలో పడటం తప్పు కాదు. ఇది సహజం. కానీ ప్రేమ పెళ్ళి చేసుకోవడం చాలా అరుదు. కానీ ఈ సంఘటన మాత్రం ప్రేమించి మోసగించిన ఒక యువకుడి కథ. పశ్చిమ గోదావరిజిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన రూపేష్‌, అవనిజలు ప్రేమించుకున్నారు. అవనిజ, రూపేష్‌‌లు ఇద్దరూ బిటెక్ చదువుతూ ప్రేమించుకునేవారు. 
 
ప్రేమలో ఉండటంతో బాయ్ ఫ్రెండ్‌ అడిగినవి ఇచ్చేసింది. పెళ్ళి చేసుకుందామని రూపేష్‌‌ను కోరింది. పెళ్ళి చేసుకుందాం కానీ 50 లక్షల కట్నం, 10 ఎకరాల పొలం, ఒక కారు కావాలన్నాడు రూపేష్. ప్రేమించిన వ్యక్తి అలా అడిగే లోపల షాకైంది అవనిజ. ప్రేమించుకున్న వారెవరెరూ కట్నం ఇచ్చి పెళ్ళిచేసుకోరంటూ అమాయకంగా రూపేష్‌ను ప్రశ్నించింది. అయితే రూపేష్‌ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరూ దూరమైపోయారు.
 
అవనిజ బిటెక్ పూర్తి చేసింది. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్ లోని రాము అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు ఇచ్చి పెళ్ళి చేశారు. నాలుగు నెలల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఇదిలావుంటే ఉద్యోగం నిమిత్తం హైదరాబాదుకు వచ్చాడు అవనిజ మాజీ లవర్ రూపేష్‌. ఉద్యోగంలో అతడు తన విధులు సరిగా చేయకపోవడంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో ఏం చేయాలో పాలుపోలేదు. అక్రమ మార్గాన డబ్బులు సంపాదించాలనుకున్నాడు. అవనిజ సెల్ నెంబర్, చిరునామాను ఎలాగోలా తెలుసుకున్నాడు. 
 
అవనిజకు ఫోన్ చేశాడు. మనిద్దరం ప్రేమించుకుని, ఏకాంతంగా కలిసి ఉన్న వీడియోలు తన దగ్గర ఉన్నాయనీ, తనకు డబ్బులు కావాలనీ, ఇవ్వకుంటే వాటిని నీ భర్తకు చూపిస్తానని ఆమెను బెదిరించాడు. తన దగ్గర డబ్బులు లేవని అవనిజ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఫోన్లు చేసి బెదిరించాడు. ఎంతకూ అవనిజ నుంచి డబ్బులు రాకపోవడంతో వీడియోలను ఒక వెబ్ సైట్‌లో ఉంచి అవనిజ ఫోన్ నెంబర్ ఇచ్చాడు. దీంతో అవనిజకు ఎవరెవరో ఫోన్లు చేసి వస్తావా అంటూ ఆమెను చిత్రహింసలు పెట్టారు. ఆందోళనకు గురైన అవనిజ ఆత్మహత్య చేసుకుందామని డిసైడ్ అయ్యింది. 
 
ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడుతుండగా భర్త రాము ఆపాడు. ఏం జరిగిందని ప్రశ్నించాడు. వెబ్ సైట్‌లో ఉంచిన వీడియోలను భర్తకు చూపించింది రాము. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన రాము భార్యను ఓదార్చాడు. అతని అంతు తేలుస్తానన్నాడు. అయితే భర్తకు నచ్చజెప్పిన అవనిజ పోలీసులకు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసింది. షీ టీం మహిళా పోలీసులు రూపేష్‌ను అదుపులోకి తీసుకుని వెబ్ సైట్‌లో పెట్టిన వీడియోలను డిలీట్  చేయించారు. ప్రస్తుతం రూపేష్ కటకటాలు లెక్కిస్తున్నాడు.