శుక్రవారం, 17 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , గురువారం, 19 ఆగస్టు 2021 (16:46 IST)

న‌వ‌రత్నాల‌పై న‌ట‌ర‌త్నాల అన్వేష‌ణ‌! షార్ట్‌ఫిల్మ్‌–2021

రాష్ట్రంలో అమలవుతున్న ‘నవరత్నాలు’ ప‌థ‌కాల‌పై న‌ట‌ర‌త్నాల అన్వేష‌ణ‌లో ప్ర‌భుత్వ‌ముంది. వీటిపై షార్ట్ ఫిల్మ్ తీసేవారి కోసం అన్వేష‌ణ ప్రారంభించింది.

న‌వ‌ర‌త్నాలు, మహిళాభివృద్ధి, సంక్షేమ పథకాలపై షార్ట్‌ఫిల్మ్‌–2021 పోటీలకు ఏపీ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌పై షార్ట్ ఫిల్మ్ తీసి పంపాల‌ని ఆ సంస్థ ఎండీ ప్రకటన విడుదల చేశారు.

మహిళా నిర్మాతలు, మహిళా సంస్థల ఆధ్వర్యంలో తెలుగులో రూపొందించిన లఘు చిత్రాలు మూడు నుంచి నాలుగు నిమిషాల నిడివితో ఉండాలని సూచించారు. నవంబర్‌ 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

దరఖాస్తు కాపీతో పాటు షార్ట్‌ఫిల్మ్‌ కంటెంట్‌ను డీవీడీ/పెన్‌డ్రైవ్, బ్ల్యూరే ఫార్మాట్లలో డిసెంబర్‌ 31లోగా తమ కార్యాలయానికి పంపాలని కోరారు. వివరాలకు www. apsftvtdc. in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.