శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 17 ఫిబ్రవరి 2015 (20:10 IST)

ప్రేమ పాఠాలు చెప్పిన టీచరమ్మ.. ప్రశ్నించిన ప్రిన్సిపాల్‌పై కేసు.. ఎక్కడ!

ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ అచ్చతెలుగు పంతులమ్మ తరగతి గదిలో తన విద్యార్థులకు ప్రేమ పాఠాలు ప్రశ్నించింది. ఇదేం పని అని ప్రశ్నించిన పాపానికి ఏకంగా ప్రిన్స్‌పాల్‌పైనే తప్పుడు కేసు పెట్టింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా సింగరాయ కొండలో చోటు చేసుకుంది. ఈ కేసు వివరాలు పరిశీలిస్తే.. 
 
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో గురుకుల పాఠశాల ఉంది. ఇందులో ఉషా అనే తెలుగు టీచర్ పని చేస్తోంది. ఈమె ప్రేమికుల దినోత్సవం రోజున విద్యార్థులకు ప్రేమను గురించి సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చింది. ప్రేమ, దాని పుట్టుపూర్వోత్తరాలు, పర్యవసానాలు... ఇత్యాది విషయాలను విపులంగా చెప్పిందట. 
 
దీనిపై ప్రశ్నించిన ప్రిన్సిపాల్ పైనే కేసు పెట్టింది. దీంతో, పోలీసులు రంగంలోకి దిగి విచారించగా, ఉష నిర్వాకం వెల్లడైంది. ఆమె తప్పుడు కేసు పెట్టిందని, ప్రేమ పాఠాలు బోధించడం నిజమేనని తేల్చారు.