బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్
vamsi, Bobby Deol , director bobby
నందమూరి బాలక్రిష్ణ లేటెస్ట్ 109 వ సినిమా కోసం బాడీడియోల్ ఎంట్రీ ఇచ్చారు. నిన్ననే ఆయనపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ముంబైకు చెందిన పలువురు యాక్సన్ కొరియోగ్రాఫర్స్ జూబ్లీహిల్స్ లోని అన్న పూర్ణ స్టూడియో ఫ్లోర్ సందడి సందడిగా వుంది. ఇందులో బాలయ్య లేని ఎపిసోడ్స్ ను చిత్రీకరిస్తున్నారు. ముంబై బేస్డ్ డాన్ కు సంబంధించిన సన్నివేశాలు దర్శకుడు బాడీ తెరకెక్కిస్తున్నారు.
ఈ యాక్షన్ కొరియోగ్రఫీని ముంబైకు చెందిన వారితోపాటు రామ్ లక్మణ్ లు కూడా వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్ పై వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా సమకాలీన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వుంటుందనితెలుస్తోంది.