బుధవారం, 16 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 మార్చి 2025 (08:18 IST)

వివేకానంద రెడ్డి హత్య కేసు: ఐదుగురు సాక్షులు అనుమానాస్పద స్థితిలో మృతి.. దర్యాప్తు

viveka
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ప్రత్యక్ష సాక్షి రంగన్న మరణంపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్పందించారు. ఈ కేసులో రంగన్న కీలకమైన సాక్షి అని, అతని మరణం చుట్టూ అనుమానాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రంగన్న మృతికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేసేందుకు దర్యాప్తు జరుగుతోందని ఎస్పీ తెలిపారు.
 
వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటివరకు ఐదుగురు సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించారని ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. వారిని శ్రీనివాస రెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, డ్రైవర్ నారాయణ యాదవ్, వాచ్ మెన్ రంగన్నగా గుర్తించాడు. ఈ మరణాలకు గల పరిస్థితులను పరిశోధించడానికి, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయబడిందని ఎస్పీ తెలిపారు. 
 
సిట్‌లో ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలు ఉంటారు. ఈ సాక్షుల మరణాలలో నిందితులకు ఏదైనా సంబంధం ఉందా లేదా అనే దానిపై కూడా దర్యాప్తు జరుగుతుంది.