12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)
అనకాపల్లి జిల్లా మాడుగుల శివారులో భారీ నాగుపాము ప్రజలను భయాందోళనకు గురిచేసింది. 12 అడుగుల భారీ గిరినాగు మాడుగుల ప్రాంతంలో హల్ చల్ చేసింది. ఈ పామును చాకచక్యంగా స్నేక్ క్యాచర్ పట్టుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. ఓ రక్తపింజర పామును వేటాడి మింగేసిన గిరినాగు పొలంలో కనిపించడంతో సదరు రైతు భయపడ్డాడు. ఆపై స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు. గంట పాటు శ్రమించిన స్నేక్ స్నాచర్స్ గిరినాగును బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇంత పెద్ద గిరినాగు ఈ ప్రాంతంలో ఎప్పుడు చూడలేదని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.