బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (07:46 IST)

నా హత్యకు కుట్ర జరుగుతుంది.. ఆడియో టేపులున్నాయి: పవన్

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశఆరు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, ఉంగుటూరు నియోజకర్గం గణపవరం క్రాస్ రోడ్స్‌లో గురువారం ప్రజాపోరాట యాత్ర బహిరంగ సభలో తన హత్యకు కుట్ర జరుగుతుందని

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశఆరు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, ఉంగుటూరు నియోజకర్గం గణపవరం క్రాస్ రోడ్స్‌లో గురువారం ప్రజాపోరాట యాత్ర బహిరంగ సభలో తన హత్యకు కుట్ర జరుగుతుందని వ్యాఖ్యానించారు. తన హత్యకు కుట్ర పన్నుతున్నదెవరో తనకు తెలుసని, ఇవన్నీ తెలుసుకునే తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. 
 
ఇప్పటికే తన హత్యపై ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకునే  ఆడియో టేపులు తన వద్దకు వచ్చాయని పవన్ సంచలన కామెంట్లు చేశారు. తనను చంపేసి అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు నెట్టేసుకోవాలని చూస్తున్నాయన్నారు. దీంతో ఆ తర్వాత జనాలు కూడా ఆ విషయాన్ని మర్చిపోతారని వాళ్లు భావిస్తున్నారని పవన్ తెలిపారు. 
 
తనది చిన్న జీవితమని.. రాజకీయాలు తెలియదని.. పవన్ చెప్పారు. వేల కోట్ల డబ్బు చేతిలో లేకపోయినా.. తనకు తెలిసిందల్లా సాటి మనిషి కష్టాల్లో ఉంటే ఆదుకోవడం ఒక్కటేనని పవన్ అన్నారు. జనసేన పార్టీ ప్రారంభించినపుడు జగన్‌లా తనకు వేలకోట్లు.. లోకేష్‌లా హెరిటేజ్ కంపెనీ లేదని అన్నారు. 
 
పవన్ కళ్యాణ్‌ సీఎం.. పవన్ కళ్యాణ్‌ సీఎం.. అని అభిమానులు నినాదాలు చేయడంపై ఆయన స్పందించారు. అసలు తాను ముఖ్యమంత్రే అవుతానని ఎందుకనుకుంటున్నారు? అంత కంటే ఎక్కువే అవుతానేమో? అని పవన్ కళ్యాణ్ తెలిపారు.