సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

రిపబ్లిక్డే పరేడ్.. ప్రత్యేక ఆకర్షణంగా ఏటికొప్పాక బొమ్మల శకటం

etikoppaka toys
దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో భారత 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన వివిధ రాష్ట్రాల శకటాలు ఆకట్టుకున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ శకటం సందర్శకులను అమితంగా ఆకర్షించింది. 
 
ఏటికొప్పాక బొమ్మలు.. ఆంధ్రప్రదేశ్‌ కీర్తి కిరీటంలో ఓ కలికితురాయి వంటివి. మామూలు కర్రతో తయారు చేసే ఈ బొమ్మలు.. దేశవిదేశాల్లోనూ ఏపీ సృజనాత్మకతను సగర్వంగా చాటి చెబుతున్నాయి. ఎటు చూసినా నునుపుగా ఈ కళాఖండాలు ఉంటాయి. 
 
ఎన్నో ఏళ్లుగా చిన్నారుల చేతుల్లో ఆటవస్తువుల్లా మారి మురిసిపోతున్నాయి. చివరికి దేశ ప్రధాని నరేంద్ర మోడీని సైతం మైమరిపించాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ బొమ్మలు గణతంత్ర దినోత్సవం నాడు శకటం రూపంలో దర్శనమిచ్చి ఆకట్టుకున్నాయి.