శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 3 అక్టోబరు 2015 (17:15 IST)

హోదా ముఖ్యం కాదు.. ప్రాజెక్టులే ప్రాణం : వెంకయ్య

ప్రత్యేక హోదా ముఖ్యం కాదు. దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. ఏమిటి లాభం.. అయినా వెనుకబడే ఉన్నాయి. ఆ రాష్ట్రాలు ప్రస్తుతం ప్రాజెక్టుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్రాజెక్టులే ప్రాణమని తెలిపారు. శనివారం నెల్లూరు జిల్లా పొదలకూరులో రూ.3.80 కోట్లతో నిర్మించనున్న 30 పడకల ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. 
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కంటే ముందు ప్రాజెక్టులను సాధించుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. ఆందోళన చెందకుండా ప్రాజెక్టులను తీసుకు రావడంలో అందరూ కలిసి వస్తే రాష్ట్రం పరుగులు పెడుతుందన్నారు. చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఉన్నప్పటికీ ఆర్థిక స్వావలంబన లేక చతికిల పడ్డాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. 
 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరవు, పొదలకూరు ఎమ్మెల్యే గోవర్థన్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ, ఎమ్మెల్సీ చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.